ఓదెల, జనవరి 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆదివారం సీపీఐ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ కనీసం 10 శాతం ఉద్యోగాలు కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీలు అమ్ముతున్నాడ ని, వ్యవసాయంలో సాగు చట్టాలు తెచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.