కోస్గి (నారాయణ పేట) : బీజేపీ నాయకుల(Bjp leaders) మాయమాటలు నమ్మి మోసపోవద్దని కొడంగల్ ఎమ్మెల్యే(Kodangal Mla ) పట్నం నరేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఏబీకే ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ కశిరెడ్డితోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్(CM KCR) సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) కి దడ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడదని పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి (Telangana development) చేస్తున్న సీఎం కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గతంలో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి రెండు సార్లు ప్రాతినిథ్యం వహించినా నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఆయనకు టీవీల్లో, పేపర్లో గప్పాలు కొట్టడమే తెలుసని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు(Palamur Project) ను పూర్తి చేసి రాబోయే రోజుల్లో సాగునీరు అందిస్తామని తెలిపారు.