టీఆర్ఎస్లో చేరిన 39, 44వ డివిజన్ల కార్పొరేటర్లు
ఆహ్వానించిన ఎమ్మెల్సీ కవిత
ఖలీల్‌వాడీ, మార్చి 27: నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను భరించలేక బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరగా, తాజా గా ఆదివారం నిజామాబాద్ కార్పొరేషన్‌లోని 39, 44వ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు లతాకృష్ణ, బైకాన్ సుధామధు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో వీరు గులాబీ కండువా కప్పుకొన్నారు.