కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు
- అందుకే రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు
- బీజేపీని నిలదీసిన మొనగాడు కేసీఆర్
- దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు వాడటం సిగ్గుచేటు
- టీర్ఎస్ నేత మోత్కుపల్లి ధ్వజం
యాదాద్రి భువనగిరి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ప్రతిపక్ష పార్టీలను ఈడీ, ఐటీ సంస్థలతో వేధించడం తప్ప, ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. బీజేపీలో ఉంటే సుద్ధపూసలు, ఇతర పార్టీలో ఉంటే పాపాత్ములా? అని ప్రశ్నించారు. బీజేపీని నిలదీసి, కేంద్రం తప్పులను కడిగిపారేసిన దమ్మున్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని చెప్పారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో వణుకు మొదలైందని, కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. అందుకే మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను నిలువరించేందుకు ఎమ్మెల్యేలకు ఎర వేశారని, ఈ కేసులో సంబంధం లేదంటూనే బీజేపీ కోర్టుకు ఎందుకు వెళ్తున్నదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేనట్టు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడంతో సహనం కోల్పోయిన బీజేపీ.. రాష్ట్రంలో చిచ్చు లేపేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 12 వేల కోట్లు ఖర్చు చేసి 8 రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీలను కూల్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Conspiracy
- dethrone
- KCR govt
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

