నన్ను చంపేందుకే బీజేపీ కుట్ర

- పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలే రక్షించారు
- కామ్రేడ్ నారాయణా కమలంలో ఎప్పుడు చేరావ్
- సాయంపొంది మా నాన్ననే మోసంచేసిన చరిత్ర నీది
- నోరు విప్పితే బజారు పాలైతవ్ జాగ్రత్త
- నీ మక్దూంభవన్‌లో బంట్రోతును కాను
- నారాయణపై మండిపడ్డ పువ్వాడ
హైదరాబాద్/ ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో తనను చంపాలనే కుట్రతోనే బీజేపీ గుండాలు దాడికి పాల్పడ్డారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ‘చికెన్ నారాయణా నోరు అదుపులో పెట్టుకో.. నేను నోరు విప్పితే బజారుపాలవుతావ్' అంటూ సీపీఐ నేత కే నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఖమ్మంలో పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం బాచుపల్లిలోని తన మెడికల్ కళాశాలకు వెళుతుండగా బీజేపీకి చెందిన రెండొందలమంది ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలే ఆ దాడి నుంచి తనను రక్షించారని చెప్పారు. ఎన్నికల నిబంధనలకనుగుణంగానే కళాశాలకు వెళ్తున్న క్రమంలో.. పోలింగ్ బూత్‌కు వెళ్తున్నానంటూ దాడి చేయడం హేయమని అన్నారు. తాను రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చానని.. అందుకనుగుణంగానే వ్యవరిస్తానని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు డబ్బులు పంచాల్సిన అవసరం లేదని, బీజేపోళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
రూ.4 కోట్లకు టికెట్ అమ్ముకున్న నారాయణ
తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉన్నదని పువ్వాడ అన్నారు. మక్దూంభవన్‌లో బంట్రోతును కాదని.. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిననిచెప్పారు. నారాయణ బీజేపీలో ఎప్పుడు చేరారో తెలియదని చురక అంటించారు. బీజేపీ గుండాల దాడిని ఆయన సమర్థిస్తున్నారా?అని ప్రశ్నించారు. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ పార్టీ చానల్ 99 టీవీని అమ్ముకున్నారని, పార్టీని సున్నా స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ‘నీ జాతకం మొత్తం నాకు తెలుసు.. నొరు విప్పితే బజా రు పాలైతవ్' అని పువ్వాడ హెచ్చరించారు. ‘మా నాన్న దగ్గరసాయం పొంది ఆయనకే ద్రోహం చేశా వు. 2006లో పువ్వాడ నాగేశ్వర్రావుకు మెజారిటీ ఉన్నా రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్నావు. 2009 లో మహాకూటమి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నిర్ణయమైతే చంద్రబాబు వద్ద రూ.4 కోట్లు తీసుకొని దాన్ని అమ్ముకున్నావు. 2011లో సిట్టింగ్ ఎమ్మెల్సీని తిరిగి ఎన్నికకాకుండా అడ్డుకున్నావ్' అంటూ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. 2018లో తనను ఓడించాలం టూ ఖమ్మంవచ్చి పిలుపునిచ్చారని.. అయినా ప్రజ లు గెలిపించారని తెలిపారు. ‘నాకు మంత్రి పదవి వ స్తే ఆయనకు లాగులు తడుస్తున్నాయని’ ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సీఎం కేసీఆర్ వదిలేసిన చెవు తెగుద్ది అని హెచ్చరించారు. పువ్వాడ వెంట ఎమ్మెల్సీ బాలసాని ఉన్నారు.
తాజావార్తలు
- కొత్త ఇంజినీర్లకు గుడ్‌న్యూస్.. ఐటీ దిగ్గజాల ప్లాన్ ఇది
- పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
- స్వయం ప్రగతితో స్ఫూర్తి పథం
- అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స
- నాలా విస్తరణ వేగవంతం చేయాలి
- ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి
- ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన టీకా
- పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు
- చెత్త సేకరణకుకొత్త ప్రణాళికలు
- తగ్గుతున్న చౌరస్తాలు.. పెరుగుతున్న యూటర్న్లు