10th Class Results | మీరట్: పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన సంతోషాన్ని పట్టలేక ఓ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పోస్టాఫీసులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్ కుమార్ కుమారుడు అన్షుల్ కుమార్ (16) అనే విద్యార్థి మీరట్‌లోని మహర్షి దయానంద విద్యాసంస్థలో పదో తరగతి చదివాడు.
శనివారం వెలువడిన ఫలితాల్లో 93.5 శాతం మార్కులు సాధించాడు. దీంతో పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యు లు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.