హసన్‌పర్తి, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్-2024 ఫలితాల్లో శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో చీర్ల సైజా 468/470, మేడిశెట్టి యశ్వంత్ 467, వేల్పుల అజయ్ 467, పూజారి జెమిని, కొత్తకొండ అక్షయ 467, గుగులోత్ తరుణ్ 467 మార్కులు సాధించారు. బైపీసీలో మూడు సుస్మిత 436/440, గుండా అన్సికా 436, కడారి కౌశిక్ 435, ఆరె హాసిని, హనుమకొండ శివాని 435, కుమ్మరికుంట్ల జోతిర్మయి 435 మార్కులు సాధించారు.
అలాగే, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో పెసల చైతన్య 989/1000, తిప్పారపు గణేశ్ 989, రావెల నందిని 989, వెల్దండి హారిక 988, దాసరి శ్వేత 988 మార్కులు సాధించారు. బైపీసీలో కంకటి హారిక 981/1000, బక్క సింధూజ 980 మార్కులు సాధించారు. వీరిని కళాశాల కరస్పాండెంట్ టీ స్వామి, ప్రిన్సిపాళ్లు జీ సురేందర్‌రెడ్డి, వీ చంద్రమోహన్, డైరెక్టర్ టీ రాజు, ఎన్.రమేశ్, ఏ మురళి, వీ సురేశ్, ఎస్.సంతోష్‌రెడ్డి అభినందించారు.