హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.
గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతున్నదని మండిపడ్డారు.