Laxettipet | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. కౌంటింగ్ రోజే పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ కౌంటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 300 వార్డుల్లో గెలుపొందగా.. 170 వార్డుల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 47 వార్డులను గెలుచుకుంది.