హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ):అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ప్రభుత్వాలను కూలగొట్టింది. దొడ్డిదారిన పీఠాలను కైవసం చేసుకొన్నది. తెలంగాణలో కూడా 30 నుంచి 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్నారని బీజేపీ నేతలే బహిరంగంగా చెప్పారు. అడ్డంగా దొరికిన తర్వాత.. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదని చెప్తున్నారు. ఆడియోల్లో అమిత్షా పేరు స్పష్టంగా చెప్తున్నట్టు ఉన్నది. సంతోష్ పేరు అనేకసార్లు వినిపిస్తున్నది. నిజంగా ఆయన తప్పు లేకపోతే అమిత్షా ఎందుకు స్పందించరు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా? ఆయనే కేంద్ర హోంమంత్రి కదా? మరెందుకు ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవడం లేదు? ఆడియో టేపుల్లో ఉన్నోళ్లు మాట్లాడాలి. కానీ, మధ్యలో ఈ బండి సంజయ్ ఎవరు? బండి ఏమీ చేయలేరనే కదా బీజేపీ ఆ ముగ్గురిని రంగంలోకి దింపింది. బీజేపీకి దేవుడంటే నమ్మకం ఉంది కదా? అమిత్షా కూడా సీతలాగా అగ్నిపరీక్ష చేసుకొని నిజాయతీని నిరూపించుకోవచ్చు కదా? అయినా.. 3 గంటల వీడియోని మార్ఫింగ్ చేయడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదా? బండి సంజయ్ అండ్ బీజేపీ బ్యాచ్ చెప్పే మాటలపై ఆ పార్టీలోనే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని, కేసులు వేస్తామని.. ఇంత వరకూ బీజేపీ చెప్పడం లేదు. అంటే వాళ్లతో సంబంధాలు ఉన్నట్టే కదా? -పాపారావు, రాజకీయ విశ్లేషకుడు