వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ యూత్ నాయకులు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డుకు చెందిన 50మంది బీజేపీ, కాంగ్రెస్ యువకులు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.