శాయంపేట, ఏప్రిల్ 15 : ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
సిద్దిపేట, ఏప్రిల్ 15 : ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నిమ్మ రజినీకాంత్‌రెడ్డి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు మంగళవారం కూలి పని చేశారు. కరీంనగర్ రోడ్డులో గల గౌరీ మిర్చిబండి వద్ద ఒకరోజు కూలి పని చేసినట్టు వారు తెలిపారు. ఇందుకు మిర్చి బండి యజమాని కూలీగా రూ.3000 ఇచ్చారని వెల్లడించారు.