
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 8: ఎన్నికల వేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. వివిధపార్టీల నుంచి పెద్దఎత్తున గులాబీ గూటికి చేరుతున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో 100 మంది విశ్వబ్రాహ్మణ కులస్థులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీణవంక మండలం నర్సింహులపల్లి ఉపసర్పంచ్ అమరగొండ తార-విజేందర్, మల్లారెడ్డిపల్లి ఉపసర్పంచ్ ముద్దసాని భిక్షపతి, మరో 10 మంది బీజేపీ నాయకులు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో పార్టీలో చేరారు. ధర్మరాజుపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన బీజేపీ కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.