హిమాయత్‌నగర్, ఆగస్టు 30 : మాల సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షమీమ్ అక్తర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా లేనందున, మాలలకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాలలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప.. మాలలు పడే గోసను మాత్రం పట్టించుకోవడంలేదని మండి పడ్డారు. మాలలకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే అగ్రకులాలకు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ గ్రూప్‌లో చేర్చాలని కోరారు. సమావేశంలో మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షుడు ఎల్ గిరిజా శంకర్, నేతలు సురేశ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.