Rytu Runa Mafi | కురవి, జనవరి 28 : ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసుతండా గిరిజన రైతు భూక్యా విజయ్ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు మూడెకరాల భూమి ఉందని, బలపాల గ్రామీణ బ్యాంకులో రూ.90 వేలు పంట రుణం తీసుకున్నట్టు తెలిపాడు.
లక్షలోపు రుణాలు ఎందుకు మాఫీ కాలేదని అధికారులను అడిగితే రెండు,మూడు, చివరి లిస్టు అంటూ కాలయాపన చేశారని పేర్కొన్నా డు. ప్రతి గ్రామంలో 100 శాతం రుణమాఫీ చేయాలని కోరుతూ బుధవారం నుంచి కురవి మండలం.. ఆ తర్వాత నియోజకవర్గం మొత్తం బైక్యాత్ర చేపట్టనున్నట్టు విజయ్ తెలిపాడు. అవసరమైతే రాష్ట్రం మొత్తం యాత్ర చేపడతానని పేర్కొన్నాడు.