నేరడిగొండలో రెండు లారీలు ఢీ.. ఎగసిపడిన మంటలు
Adilabad | నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగినవెంటనే ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ అందులోనుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, కింద పడిఉన్న లారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

