AIIMS Bibinagar | బీజేపీ ప్రచారం కోసమే బీబీనగర్ ఎయిమ్స్.. నిధులన్నీ గుజరాత్‌కే.. స్వయంగా ఒప్పుకొన్న కేంద్ర బీజేపీ సర్కారు
AIIMS Bibinagar | తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది.
AIIMS Bibinagar | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేశాం తప్ప..దాని నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం గమనార్హం. బీబీనగర్ ఎయిమ్స్‌కు విడుదల చేసిన నిధులపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం ఇచ్చింది.
అరకొర నిధులే..: బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి 2018 డిసెంబర్ 17న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో అత్యాధునిక వసతులతో దవాఖానను నిర్మిస్తామని డబ్బా కొట్టుకొన్నది. 2022 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించుకొన్నది. కానీ.. 2022 జూలై వరకు కనీసం పనులు మొదలుపెట్టలేదు. దీంతో కేంద్రం గడువును 2024 అక్టోబర్‌కు పొడిగించింది. అంచనాలను రూ.1,365. 95 కోట్లకు పెంచింది. అంటే.. సుమారు 340 కోట్లు అదనం. ఇందులో ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులు కేవలం రూ.156 కోట్లు. అంటే మొత్తం అంచనాల్లో 11.4 శాతం. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణలోని ఎయిమ్స్‌కు వంద రూపాయలు కావాల్సిన చోట కేవలం రూ.11 విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. వైద్యం విషయంలోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపింది.
మిగతా రాష్ర్టాల్లో ఇలా..
- మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి 2019 జనవరి 10న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణ వ్యయం రూ.1,195 కోట్లు. తెలంగాణ తర్వాత మంజూరైన ఈ ఎయిమ్స్‌కు కేంద్రం ఇప్పటివరకూ రూ.622 కోట్లు మంజూరు చేసింది. అంటే 52 శాతం నిధులు ఇచ్చేసింది.
- హిమాచల్‌ప్రదేశ్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి 2018 జనవరి 3న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. రూ.1,471 అంచనా వ్యయం కాగా.. ఇప్పటివరకూ రూ.1,407 కోట్లు మంజూరు చేసింది. అంటే 96 శాతం నిధులను ఇచ్చేసింది.
- జార్ఖండ్‌కు 2018 మే 16న ఎయిమ్స్‌ను మం జూరు చేసింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. 2019 ఎన్నికల నేపథ్యంలో భారీగా నిధులు విడుదల చేసింది. దీని నిర్మాణ వ్యయం రూ.1,828 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.793 కోట్లు విడుదల చేసింది. అంటే 43 శాతానికిపైగా నిధులు ఇచ్చింది..
- కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సమానంగా తమిళనాడుపై కక్ష పెంచుకొన్నదని అందరికీ తెలిసిందే. ఆ రాష్ర్టానికి తెలంగాణతోపాటే ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. రూ.1,977 కోట్ల నిర్మాణ వ్యయం కాగా.. ఇప్పటివరకూ విడుదల చేసింది కేవలం రూ.12.35 కోట్లు. అంటే ఒక్క శాతం నిధులు కూడా కాదు. ఈ విషయాలన్నీ స్వయంగా కేంద్రమే ఒప్పుకొన్నది.
ఏడాదిన్నరలో ఎట్లా పూర్తిచేస్తరు?
ఎయిమ్స్ మంజూరై ఐదేండ్లు గడుస్తున్నా కనీసం ఒక్క భవనం నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం పనుల్లో 5 శాతం మాత్రమే జరిగాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లోనే తాత్కాలికంగా కళాశాల, వైద్యశాల నడుస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెప్తున్నది. ఇంకా 20 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. 20 నెలల్లో 88 శాతం నిధులు విడుదల చేసి.. 95 శాతం పనులు పూర్తి చేయడం అసా ధ్యం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కంటితుడుపుగా నిధులు ఇచ్చి ప్రచారం చేసుకోవడం తప్ప.. కేంద్రానికి బీబీనగర్ ఎయిమ్స్‌ను ఈ జన్మలో పూర్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం అవుతున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

