భువనగిరి అర్బన్, డిసెంబర్ 30 : ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చే వరకూ ఆందోళనలు చేస్తామని, భూములు మాత్రం ఇచ్చేది లేదని బాధిత రైతులు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రాయగిరి, పెంచికల్పహాడ్ గ్రామాల రైతులు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవార్డు విచారణ సమావేశాన్ని బహిష్కరించారు.
బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్ మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం చేస్తున్నదని విమర్శించారు. ట్రిపుల్ఆర్ నిర్మాణంలో చిన్న, సన్నకారు రైతులు మాత్రమే భూములు కోల్పోతున్నారని, అలైన్మెంట్ మార్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.