Gandhi Bhavan| హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : గాంధీభవన్ సాక్షిగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు బాహాబాహీకి దిగారు. పదవుల కోసం తన్నుకున్నారు. బుధవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పొంగులేటి వర్గానికి చెందిన చీకటి కార్తీక్ తప్పుడు బర్త్ సర్టిఫికెట్తో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా గెలిచారని భట్టి వర్గం నేతలు ఆరోపించారు. దీనిపై గాంధీభవన్‌లో జరుగుతున్న సమావేశంలో సుధీర్ అనే కార్యకర్త ప్రశ్నించారు. దీంతో ఆయనపై పొంగులేటి వర్గం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గాంధీభవన్ లోపలి నుంచి బయటి వరకు ఉరికిస్తూ పిడిగుద్దులు కురిపించారు. దీంతో సుధీర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై గాంధీభవన్ వర్గాలు స్పందించకపోవడం గమనార్హం.
డిచ్పల్లి, జనవరి 22 : మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ యా దగిరిరావుకు వినతిపత్రం అందజేశాయి. బకాయిలు విడుదల కాకు ంటే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవ్ హెచ్చరించారు. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించడంలేదని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.