హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరులో ఈ నెల 18న ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఐదేండ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీటి వసతి కలుగుతుందని తెలిపారు.