హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మూసీ నిర్వాసితులకు అక్కడే టవర్స్ నిర్మిస్తామని, వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ సూల్స్ ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం నిర్డ్కో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. మూసీ నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు రూ.1,000 కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. కాలుష్య డ్రైనేజీల ట్రీట్మెంట్కు 39 ఎస్టీపీలు మంజూరుచేసినట్టు చెప్పారు. భవిష్యత్తుతరాల కోసం మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల మూలంగా రిజిస్ట్రేషన్లలో కొంత స్తబ్ధత ఏర్పడిందని, ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నట్టు పేర్కొన్నారు.