Hairsh Rao | అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ జూటా బడ్జెట్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమీ లేవని.. ఎన్నికల ముందు అన్ని చేస్తాం.. అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారని.. రేవంత్‌రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు. బడ్జెట్లో లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నారని.. రూ.20వేల కోట్లు ఇచ్చినం అంటున్నారన్నారి ఆరోపించారు. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తం అన్నారని, మొత్తం వర్తిస్తదా అంటే లేదు 5లక్ష వరకే వర్తిస్తది అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని గుర్తు చేశారు.
5లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా రూ.15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నారన్నారు. మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెబుతున్నది నిజమన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలందరినీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు రూ.75 ఇస్తున్నం అంటున్నారని.. గత బడ్జెట్లోనూ ఇదే చెప్పారని.. మక్కీకి మక్కీ కాపీ కొట్టారన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నదని.. అది రూ.50 మాత్రమేనన్నారు. రూ.75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్లో చెప్పారని.. ఈ విషయంలో తాను చాలెంజ్ చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం 6.47లక్షల కార్డులు ఇచ్చిందని తెలిపారు. అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్దాలేనని.. 72 పేజీల భట్టి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదన్నారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
సోనియాగాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారని.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. ఈ బడ్జెట్లో అయినా అమలు చేస్తారని ప్రజలు ఆశగా చూశారన్నారు. మహాలక్ష్మి ఊసేలేదని.. రూ.2500 లేదు కానీ.. రూ.2500కోట్లు అందాల పోటీల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారని విమర్శించారు. చేయూత కింద రూ.4వేల పెన్షన్ అని చెప్పారని.. అదీ గతిలేదన్నారు. వృద్ధులు, గీత, చేనేత, ఎయిడ్స్ పేషెంట్లను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కొత్త పింఛన్ ఇయ్యలేదని.. ఉన్న పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టారన్నారు. పింఛన్లలో కోత పెట్టారన్నారు. రుణమాఫీ అయినోళ్లు తక్కువ.. కానోళ్లు ఎక్కువ ఉన్నారన్నారు. రుణమాఫీ అయిపోయినట్లు చేస్తున్నారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో రూ.2లక్షల్లోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదని.. ఎక్కడైనా ఈ విషయంలో తాను చర్చకు సిద్ధమేనన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారన్నారు. కల్యాణలక్ష్మిలో తులం బంగారం కేటాయింపు లేవన్నారు.
గత బడ్జెట్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అన్నారని.. ఈ ఏడాది పన్నెండు పూర్తి చేస్తం అన్నారన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తయితే.. దాని పేరు చెప్పాలన్నారు. బడ్జెట్ అన్ రియలిస్టిక్‌గా ఉందని.. బడ్జెట్ ప్రసంగం మక్కీకి మక్కీ ఉండడం సిగ్గుచేటరన్నారు. ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని.. దక్షిణ భాగానికి డీపీఆర్ చేస్తున్నామని మల్లా పాత బడ్జెట్లోని అంశమే చెప్పారన్నారు. పని ముంగటికి పోయింది లేదని.. రూపాయి ఇచ్చింది లేదు.. ఎకరం సేకరించింది లేదంటూ విమర్శలు గుర్పించారు. జీఎస్డీపీ గ్రోత్ రేటు 12.9శాతం ఉంటే.. కాంగ్రెస్ పాలనలో 10.1 శాతం అన్నారని.. 2.8శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పాలనలో 12.4శాతం ఉంటే.. కాంగ్రెస్ పాలనలో 9.6శాతం ఉందని.. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అప్పులు అప్పులు అంటుడని.. బడ్జెట్ పుస్తకాలు చూస్తే రెవెన్యూ సర్ ప్లస్ సేట్ అని చెబుతుందన్నారు. గతేడాది రూ.5888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది.
ఈ బడ్జెట్ లో 2738 కోట్ల సర్ ప్లస్ ఉంటదని ప్రతిపాదించారని.. సర్ ప్లస్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించారని.. మీ ఆలోచన విధానం వల్ల దివాలా తీసిందన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నాడని.. పుస్తెల తాళ్లు తెంచుతున్నడని మండిపడ్డారు. ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా రూ.50వేల కోట్ల రాబడి ఆశిస్తున్నాడని.. బీఆర్ఎస్ హయాం కంటే రూ.12 నుంచి రూ.13వేల కోట్లు ఎక్కువ అని తెలిపారు. రూ.7వేల కోట్లు ఎక్కువ పెట్టానరని గత బడ్జెట్లో ప్రశ్నిస్తే లేదు లేదు అన్నారని.. కానీ మద్యం ధరలు విపరీతంగా పెంచారని ధ్వజమెత్తారు. తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారన్నారు. సీఎస్ఎస్ ద్వారా కేంద్రం నుంచి 15,729 కోట్లు వస్తయని బడ్జెట్లో పెట్టారని.. 2023-24లో వచ్చింది రూ.5,966 కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రం నరేగా కోసం గతేడాది రూ.86వేల కోట్లు పెట్టిందని.. ఇప్పుడు కూడా అంతే పెట్టిందన్నారు. కానీ, గతేడాది రూ.2600 కోట్లు.. ఇప్పుడు రూ.3వేలకోట్లు ఎలా వస్తాయని బడ్జెట్లో పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉంటారని.. కోటి మంది కూలీలకు రూ.12వేలు ఎంత కావాలె? నిజానికి 50వేల మందికి కూడా ఇవ్వలేదన్నారు.