చందనవెల్లి భూమి అవకతవకలపై విచారణ
చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- బాధితులకు డిప్యూటీ సీఎం హామీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందనవెల్లి పరిధిలో శుక్రవారం జున్నా సోలార్పవర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన ఉపముఖ్యమంత్రిని భూ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందనవెల్లి గ్రామ సర్వే నంబర్ 190లో చేపట్టిన భూసేకరణలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
ఎంజాయ్మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు సైతం బాధితులు తన దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎంజాయ్మెంట్ సర్వే పేరిట రికార్డుల్లో లేని వారి పేర్లను చేర్చి భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని, దీనిపై సమగ్రవిచారణ చేయిస్తానని వెల్లడించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

