గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపట్టిన ఆందోళన శనివారం 25వ రోజుకు చేరుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన దాదాపు 100 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.
తమకు న్యాయం జరిగేవరకు ఆందోళన చేస్తామని ఉద్యోగులు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం, సంధ్య, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.