శేరిలింగంపల్లి, ఆగస్టు 21 : ప్రభుత్వం న్యాయం చేసే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు చెప్పారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్‌పల్లిలో కొనసాగుతున్న టీన్జీవోల ఆందోళన గురువారంతో 37వ రోజుకు చేరింది.
వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సోసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. తమ సమస్యపై ప్రభుత్వం దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు.