Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీలో చదువుకునే పిల్లలకు అత్యుత్తమ బోధనతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అయితే భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల కూడా తన కుమారుడు కైరాను అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం చేర్పించారు. అర గంట పాటు అంగన్వాడీ కేంద్రంలోనే ఉన్న కలెక్టర్.. పిల్లలకు బోధించే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు టీచర్లు ఆటపాటలు నేర్పించారు. కలెక్టర్ కూతురు మైరా కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవో పాల్గొన్నారు.
Collector Priyanka1