Bengaluru Techie | బెంగళూరులో దారుణం.. తెలంగాణకు చెందిన దంపతుల ఆత్మహత్య
Bengaluru Techie : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Bengaluru Techie : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన భానుచందర్ రెడ్డి (32), అతడి భార్య బీబీ షాజియా సిరాజ్ (31) ఇద్దరూ కలిసి బెంగళూరులోని కోతనూర్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు.
వీరిద్దరూ వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. వీరి పెళ్లై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. మొదట ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లైనప్పటి నుంచి వీరిద్దరి మధ్యా విబేధాలు తలెత్తాయి. దీంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో సోమవారం భానుచందర్ రెడ్డి తన గదిలోపల తలుపు పెట్టుకుని, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సాజియా సిరాజ్ ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె సెక్యూరిటీతోపాటు చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వారు వచ్చి తలుపు బద్దలుకొట్టి చూసేసరికి భానుచందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన భార్య సాజియా వెంటనే అదే అపార్ట్మెంట్ 17వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అక్కడికక్కడే మరణించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతికి వైవాహిక కలహాలతోపాటు భాను చందర్ రెడ్డి అనారోగ్యం కూడా ఒక కారణం అయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

