హైదరాబాద్, జూన్ 15 (నమసే తెలంగాణ): దశాబ్దాలపాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,587 మంది సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా కేవలం 1,310 మందికే చెల్లించడం శోచనీయమని సోమవారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు.
మొత్తం రూ. 21.39 కోట్లకుగానూ కేవలం మూడోవంతు రూ. 7.98 కోట్లు చెల్లించారని తెలిపారు. ఇంకా 2,277 మందికి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని కో రారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చినమేరకు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.