ప్రొసీడింగ్ ఇవ్వకపోతే ఆత్మహత్యే గతి.. ఎంపీడీవో ఆఫీసులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ఆవేదన
ప్రొసీడింగ్ కాపీల కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయం చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రొసీడింగ్ ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.
నిజాంసాగర్, ఫిబ్రవరి 6: ప్రొసీడింగ్ కాపీల కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయం చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రొసీడింగ్ ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగిలో 13 మందికి 20 రోజుల క్రితం ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వారికి ప్రొసీడింగ్ కాపీలు వెలువడినా అధికారులు అందజేయలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి తమకు ప్రొసీడింగ్ కాపీలు ఇస్తే ఇండ్లు నిర్మించుకుంటామని, లేదంటే చావే శరణ్యమంటూ బైఠాయించారు.
పోలీసులు వారిని సముదాయించగా, 6న ప్రొసీడింగ్ కాపీలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉద యం గ్రామానికి చెందిన వడ్ల అమృత భర్తతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లింది. ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలని ఎంపీడీవోను వేడుకున్నా స్పందన కరువైంది. దీంతో ఆమె పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకుంటానని రోదించసాగింది.
ఇంటిని నిర్మించుకుందామంటే అధికారులు ఈ విధంగా చేయడం తగద,ని ప్రొసీడింగ్ కాపీ ఇవ్వకపోతే చావే శరణ్యమని, కలెక్టర్ చొరవ తీసుకోవాలని వేడుకున్నది. ఈ విషయమై ఎంపీడీవో శివకృష్ణను వివరణ కోరగా, అనివార్య కారణాలతో ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వలేకపోయామని, త్వరలో అందజేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

