Home
Telangana
Beneficiaries And Dalits Staged A One Day Protest At Gandhi Chowk In Mulugu District Center To Release The Second Installment Of Dalit Bandhu Funds
దళితబంధు నిధులు విడుదల చేయాలి
రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద లబ్ధిదారులు, దళితులు గురువారం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు.
- ములుగులో లబ్ధిదారుల నిరసన దీక్ష
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి మద్దతు
ములుగురూరల్, జనవరి 25: రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద లబ్ధిదారులు, దళితులు గురువారం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. దళితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షకు భూపాలపల్లి, పినపాక, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన దళితబంధు సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

