గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 22:40:18

ఎమ్మెల్యే చిన్నయ్య పెద్దమనస్సు

ఎమ్మెల్యే చిన్నయ్య పెద్దమనస్సు

కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గట్రావ్‌పల్లిలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం తెలిపారు. గట్రావ్‌పల్లికి చెందిన అర్క భీమ్‌రావు, అంబిక దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం భీమ్‌రావు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి కూలీ పనిచేస్తూ పిల్లలను అంబిక పోషిస్తున్నది. నెల క్రితం ఆమె కూడా అనారోగ్యంతో చనిపోవడంతో పిల్లలు నాగుబాయి(19), లక్ష్మి(16), హన్మంతు(13) అనాథలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నయ్య బుధవారం గ్రామానికి వెళ్లి పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారికి నిత్యావసర సరుకులు అందించారు. తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడుతున్న వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.logo