రామగిరి, మార్చి 1 : పదో తరగతి వార్షిక పరీక్షలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సొంత ఖర్చుతో విమానంలో బెంగళూరుకు తీసుకెళ్తానని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మల్క రాంకిషన్రావు వినూత్న కానుకను ప్రకటించారు. శనివారం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పరీక్షలకు ముందు 20 రోజులపాటు ఉదయం, సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతులకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారందరికీ విమాన ట్రిప్ వర్తిస్తుందన్నారు.