కరోనా ఎఫెక్ట్.. బేగంబజార్ మార్కెట్ పనివేళల్లో మార్పు
బేగంబజార్| రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్‌లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్‌లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో మార్కెట్లోని దుకాణాల వేళల్లో మార్పులు చేస్తూ ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరుస్తామని, సాయంత్రం 5 గంటలకు షాపులను మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలను పాటిస్తాయని చెప్పారు. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.
గతంలో కూడా భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో బేగంబజార్‌లో దుకాణాలను వారం రోజులపాటు మూసివేశారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి గతేడాది జూన్ 28 నుంచి వారం రోజులపాటు మార్కెట్‌ను కిరానా మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా మూసివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
‘బ్లూ’టీ తాగండి..‘యవ్వనం’గా ఉండండి
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
మోనాల్‌కు ముద్దిచ్చిన డ్యాన్స్ మాస్టర్- వీడియో
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

