హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటండి అని చెప్పిన మహమ్మద్ ప్రవక్త సూక్తిని ఈ సందర్భంగా ఎంపీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార, తదితర వర్గాల ప్రజలు పర్యావరణ హితానికి తమ వంతుగా మొక్కలు నాటుతూ ఇతరులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటండి. -మహమ్మద్ ప్రవక్త-
— Santosh Kumar J (@MPsantoshtrs) May 14, 2021
Whatever the situation you are in. Be it a storm or anything, plant a sapling. No matter or what
اگر آپ کےآس پاس سیلاب آنے کے وقت بھی آپ کے ہاتھ میں ایک پودا ہے تو ، اسے لگائیں – پیغمبر اسلام pic.twitter.com/cZRM8l0FQ6