Vishwas Kumar | ఆ ఘోర ప్రమాదం తర్వాత నిద్రలేని రాత్రులతో బాధపడుతున్న : విశ్వాస్ కుమార్ రమేష్
Vishwas Kumar | జ్ఞాపకాలు మనిషికి స్వాంతననివ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటే మనసు పులకరించి పోవాలి. కానీ, కొన్నిసార్లు కొందరి జీవితాల్లో జ్ఞాపకాలు పీడకలలుగా మిగిలిపోతాయి.
Vishwas Kumar | జ్ఞాపకాలు మనిషికి స్వాంతననివ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటే మనసు పులకరించి పోవాలి. కానీ, కొన్నిసార్లు కొందరి జీవితాల్లో జ్ఞాపకాలు పీడకలలుగా మిగిలిపోతాయి. నిరంతరం వేధిస్తుంటాయి. తాను అలాంటి బాధనే అనుభవిస్తున్నానని సరిగ్గా సంవత్సరం క్రితం విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్(39) చెప్తున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనతో ముక్కలైన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకోవడానికి ఇప్పటికీ పోరాడుతున్నానని తెలిపాడు.
ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆందోళన, నిద్రలేని రాత్రులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని విశ్వాస్ కుమార్(Vishwas Kumar Ramesh)అన్నారు. గతేడాది జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో (Ahmedabad) కూలిపోయిన ఏఐ-171 విమాన(AI-171 plane) ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్. విమానం కూలిపోయి నేటికి సంవత్సరం పూర్తవుతున్నా నాటి ఆ భయానక జ్ఞపకాలు తనను నిరంతరం వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. నిత్యం ప్రమాదం జరిగిన సంఘటనలే కళ్లే ముందే కదులాడుతుండటంతో ఆందోళనకు గురై నిద్రకు దూరమయ్యానని పేర్కొన్నాడు.
ప్రజలు నేను ప్రమాదం నుంచి బయట పడిందే చూస్తున్నారని కానీ, నాలుగు గోడల మధ్య నిరంతరం నేను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను చూడటం లేదని వాపోయాడు. ఈ ప్రమాదంలో తన 35 ఏళ్ల సోదరుడు అజయ్‌ను కోల్పోయినట్లు తెలిపారు. ఈ కష్ట కాలంలో తన కుటుంబ సభ్యులు, మిత్రులు అందించిన సహకారం మరిచిపోలేనిదన్నారు. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చివరి దశకు చేరుకుందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

