అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా వైసీపీ( YCP ) నాయకులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) ఆదేశాల మేరకు వెన్నుపోటు ( Backstabbing )కు రెండేళ్లు కార్యక్రమాలను నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటుకు గురిచేసిందని ఆరోపిస్తూ నగిరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఒకప్పుడు ప్యాకేజీ స్టార్‌గా ఉన్న పవన్ కల్యాణ్ నేడు క్యాబేజీ స్టార్‌గా మారిపోయారని అన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని ప్రకటించి ఇంతవరకు న్యాయం చేయలేదని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యనించారు.
నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరవక పోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.