హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయా వైద్య కాలేజీలు అనుమతి లేని వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. ఈ అంశమై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన దేశంతోపాటు విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే వారు ప్రవేశాలకు ముందే నియమనిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించింది.