హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రైతాంగానికి పోలీసుశాఖ సోమవారం సూచించింది. కొనుగోలు సమయం లో ఒకటికి రెండుసార్లు విత్తనాలు చెక్ చేసుకోవాలని తెలిపింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని అనుమానం వచ్చినా, నకిలీవని తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ రవిగుప్తా కోరారు.