ముషీరాబాద్, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మండలి విపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వీ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపిన బీసీ నేతలు, రాజకీయాలకతీతంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. వక్తలు మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపడుతున్న కేంద్రం ఎస్సీ, ఎస్టీల కోసం ప్ర త్యేక కాలమ్ కేటాయించి బీసీలకు మాత్రం మొండిచెయ్యి చూపిందని మండిపడ్డారు. బీసీనని చెప్పుకొంటున్న ప్రధాని మోదీ బీ సీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
బీసీ కులగణన డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరిగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీసీల లెక్కలు లేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించా రు. జనగణనలో కులగణన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఢిల్లీలో అగ్రకులాలకు చెందిన కొందరు ఆందోళన చేపట్టారని ఆ రోపించారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, రిటైర్డ్ డీజీపీ పూర్ణచందర్రావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బాలగోని బాలరాజ్గౌ డ్, దుర్గయ్యగౌడ్, ఎర్ర సత్యనారాయణ, కోల జనార్దన్, శ్యామ్ కురుమ, సరిత, ఆర్ లక్ష్మణ్‌యాదవ్, శ్రీకాంత్, రేణుక, పుటం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.