Seethakka | ములుగు, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘మా మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నయి. 2,000 మంది బీసీలు , 2,400 మంది ఎస్టీలు, 2,400 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక్క పంచాయతీ స్థానమూ బీసీలకు రాలేదు. ఇదేం చోద్యం’ అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఓ యువ కుడు ప్రశ్నించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మం త్రికి ఇలా చుక్కెదురైంది. గ్రామానికి చెందిన యువకుడు భీమని నరేశ్ సర్పంచ్ రిజర్వేషన్ల విషయంపై మంత్రి సీతక్కను నిలదీశారు. మండలంలో కాంగ్రెస్ నాయకులను తమ భుజాలపై ఎత్తుకొని అనుక్షణం మోశామని నరేశ్ మంత్రితో చెప్పారు.
స్పందించిన మంత్రి రాజ్యాంగం ప్రకారం తొలుత ఎస్సీ, ఎస్టీల కు, ఆ తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్తుండగా, ‘సరే అక్కా.. మా బీసీలకు ఒక్కటైనా రావొ ద్దా.. పార్టీ తరఫున 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్నారు. మా మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వరా’ అని మంత్రిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నాయకుడు కల్పించుకొని జనరల్ స్థానాలు వచ్చాయని అన్నాడు. దీంతో నరేశ్ మళ్లీ కల్పించుకొని 2,450 మంది ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చాయని చెప్తుండగా, సీతక్క మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా కింద కుదించబడ్డాయని వివరణ ఇవ్వబోయారు. ఈ సమయంలో నరే శ్ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడబోతుండగా, ఇతర కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు. దీంతో బీసీ రిజర్వేషన్ల సెగ తగలడంతో లాభం లేదనుకున్న మంత్రి సీతక్క అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మా బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త
పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని మండలంలో ఒక్క బీసీ సీటు ఇవ్వలేదంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త
ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం మండలంలో 6000 మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు… https://t.co/ieaUfusCiy pic.twitter.com/lskN2ohlkG
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2025