హైదరాబాద్,అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఒక ప్ర కటనలో డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేదంటే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని కోరారు.