హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టడంతోపాటు బీసీ రిజర్వేషన్లను జనా భా దామాషా ప్రకారం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో విజయవాడ లో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల, శంకర్రావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో జాతీ య పార్టీల మోసపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఇకనైనా బీసీ కులగణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కల్పించేలా కేంద్రంపై కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టులో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు.