హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు 4 మంత్రి పదవులు దకగా, కాంగ్రెస్ పాలనలో నేడు 2 పదవులే దక్కాయని, కాంట్రాక్టులు, కమీషన్లు, ప్రాధాన్యత కలిగిన అధికార పోస్టులను అగ్రవర్ణాలకే కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు, ఇతర ఉన్నత స్థాయి పదవులను కేవలం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం, ప్రాతినిధ్యం ఇవ్వడం సమ సమాజ నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.