ఖైరతాబాద్, డిసెంబర్ 21 : బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ని ఎందుకు సమర్థించిన్రు? అని ఎంపీ ఆర్ కృష్ణయ్యను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ ప్రశ్నించారు. ఆర్ కృష్ణ య్య బీజేపీ ఎంపీ హోదాలో ప్రధానమంత్రి పక్కనే కూర్చుంటారని, కానీ, 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, అం బాల నారాయణగౌడ్లతో కలిసి బాలరాజుగౌడ్ మాట్లాడుతూ.. జీవో-9 తీసుకురాగానే బీసీ సంఘాల ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు సీఎం రేవంత్‌రెడ్డికి వంతపాడారని, ఆయన ఇంటిచూట్టూ ప్రదక్షిణలు చేశారని ఎద్దేవా చేశారు.
ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17శాతం మాత్రమే ఇచ్చి బీసీలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. అయినా, జనరల్ స్థానాలను కూడా వదలకుండా 51శాతం మంది బీసీలు సర్పంచ్‌లుగా గెలిచి రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి బీజీపీకి 8 మంది ఎంపీలున్నా, బీసీల రిజర్వేషన్లపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలే బీసీల రాజ్యాధికారానికి తొలిమెట్టని, అదే స్ఫూర్తితో రాను న్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశం లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు ఎలికట్టె విజయ్‌కుమార్, బైరు శేఖర్గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.