హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో నేడు నిర్వహించనున్న కాంగ్రెస్ జనగర్జన సభావేదికగా బీసీ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాం డ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖను జాజుల శనివారం విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయించడంతోపాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. అదే ఫార్ములా తెలంగాణలోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలో రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే బహుజనులు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టక తప్పదని హెచ్చరించారు.