బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలి
బీసీలు ఇప్పుడు మేల్కొనకపోతే వారికి ఉనికి ఉండదని, పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జనగణనలో ‘ఓబీసీ కులాలకు తీరని అన్యాయం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
- ఇప్పుడు మేల్కొనకపోతే ఉనికి ఉండదు
- హక్కులు అమలుచేయకుంటే తిరుగుబాటే
- రౌండ్‌టేబుల్ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్
ఖైరతాబాద్, ఏప్రిల్ 4: బీసీలు ఇప్పుడు మేల్కొనకపోతే వారికి ఉనికి ఉండదని, పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జనగణనలో ‘ఓబీసీ కులాలకు తీరని అన్యాయం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. బీసీలతో ఎంబీసీలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు, మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, బీసీలకు మాత్రం 42% అంటున్నారని, పైగా 50% సీలింగ్ పెట్టడం వల్ల కోర్టుల్లో కేసులు నిలబడటం లేదని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు 80 ఏండ్ల వయసులో కూడా బీసీల కోసం పోరాడుతూనే ఉన్నారని కొనియాడారు. బీసీలకు హక్కులు అమలు చేయకుంటే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. 1881లోనే కులగణన ప్రారంభమైందని, 1931లో బీసీల లెక్కలు తేల్చారని చెప్పారు.
ఆ తర్వాత 1948లో సెన్సెస్ యాక్ట్‌ను తయారు చేశారని, అయితే అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి బీజేపీ పాలన వరకు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో పార్లమెంట్ సాక్షిగా జనగణనతోపాటు కుల గణన చేయాలని డిమాండ్ చేసిందని, కానీ నేడు అధికారంలో ఉన్నా అందుకు పూనుకోవడం లేదని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

