హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగా ణ): సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. అమెరికాలో ప్రపంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమని కొనియాడటంపై హర్షం వ్యక్తం చేశారు.
నదీ జలాలను సముద్రమట్టానికి 500 మీటర్ల పైకి తీసుకురావడం ఊహకు అందని ఆలోచనంటూ ప్రపంచంలోనే అగ్రగామి సివిల్ ఇంజినీర్స్ కేసీఆర్ మేధాశక్తిని పొగడటమంటే అది దేశ ప్రజలందరికీ గర్వకారణమని అభివర్ణించారు. రాబో యే కాలంలో కేసీఆర్ నాయకత్వంలో దేశం లో అనేక కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించి, తెలంగాణ ఏరకంగా అభివృద్ధి చెందిందో దేశం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.