15 రోజుల్లోగా డైరెక్టర్ల పూర్తి వివరాలివ్వండి
2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీ స్ అసోసియేషన్ ఫిర్యాదు క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
- విద్యుత్తు సంస్థకు బీసీ కమిషన్ ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): 2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీ స్ అసోసియేషన్ ఫిర్యాదు క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి ట్రాన్స్‌కో కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.
సీఎండీ కృష్ణభాసర్, డైరెక్టర్లు శ్రీనివాసులు, లత, వినోద్‌తో సమీక్షించి, రిజర్వేషన్లు సహా పలు అంశాలపై విచారించారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల ప్రమోషన్లు, సీనియారిటీ, ఇతర అంశాలను పరిశీలించాలని, సంస్థలో బీసీ సెల్ ఏర్పాటుకు వసతులు కల్పించాలని చైర్మన్ నిరంజన్ సూచించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్య కార్యదర్శి బాల మాయదేవి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, ట్రాన్స్‌కో అధ్యక్ష కార్యదర్శులు ఎం అశోక్‌కుమార్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

