BC Reservations : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలనే బీసీలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) హామీని అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ (G. Niranjan) ప్రభుత్వానికి సూచించారు. 2019 పంచాయితి ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయని, ఈసారి మాత్రం బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంజన్ విమర్శించారు.
రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య 56.33% అని కులగణన సర్వేలో తేలిన తర్వాత కూడా 2019 ఎన్నికల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని బీసీ కమిషన్ ఛైర్మన్ అన్నారు. రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో జరిగిన పొరపాట్ల వల్లనే బీసీ రిజర్వేషన్లు గతంలో కంటే ఈసారి తగ్గాయని ఆయన వెల్లడించారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్
2019 పంచాయితి ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయి.. ఇప్పుడు దీనికంటే తక్కువ రిజర్వేషన్లు బీసీలకు కల్పించారు
బీసీల సంఖ్య జనాభాలో 56.33% అని కులగణన సర్వేలో తేలిన… pic.twitter.com/g0GNVj2x8m
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2025
అందుకని పంచాయతీ ఎన్నికలను నిలిపివేసి, ఒక ఉన్నతస్థాయి కమిటీ(High Level Committee)ని ఏర్పాటు చేసి, రిజర్వేషన్లలో జరిగిన తప్పులను సవరించాలని నిరంజన్ డిమాండ్ చేశారు. సవరణల తర్వాతే అప్పుడు ఎన్నికలకు వెళ్లాలని లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.