హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో సోమవారం భారీ ధర్నాను నిర్వహించింది. ధర్నాలో సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి షణ్ముగం, తెలంగాణ వరింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.